- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అతను చీఫ్ గెస్టుగా వస్తే ఇక సినిమా సంగతి అంతే.. నాని హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Nani), శైలేష్ కొలను(Sailesh Kolanu) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’(Hit-3). ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘హిట్’ ఫ్రాంచైజీస్‌లో తెరకెక్కుతుండగా.. దీనిని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని(Prashanthi Tipirneni) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే నాని ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ అన్ని సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.
ఇక ఈ మూవీ మే 1న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదారాబాద్‌లో హిట్-3 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి రాజమౌళి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘2018లో నా ఫస్ట్ సినిమా కేజీఎఫ్-1 సినిమా ఆడియో లాంచ్ హైదరాబాద్‌లో అయింది.
ఆ టైంలో చీప్ గెస్టుగా రాజమౌళి సార్ వచ్చారు. అప్పుడు ఆ మూవీ సూపర్ హిట్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మిమ్మల్ని కలిశాను. మళ్లీ నా తెలుగు డెబ్యూ “హిట్ 3”కి రాజమౌళి గెస్ట్ గా వచ్చారు.. సో నేను ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నాను.. మీరు రావడం నాకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది’ అని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం శ్రీనిధి శెట్టి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది.