- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
లోకయుక్తగా జస్టీస్ ఏ. రాజశేఖర్ రెడ్డి, ఉప లోకయుక్తగా జగ్జీవన్ కుమార్ ప్రమాణ స్వీకారం

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఉన్న రాజ్ భవన్ (Raj Bhavan)లో లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారం (Oath taking) జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) లోకయుక్త, ఉపలోకాయుక్త లతో ప్రమాణ స్వీకారం చేయించారు. లోకయుక్తగా జస్టిస్ ఏ. రాజశేఖర్ రెడ్డి, ఉప లోకయుక్తగా జగ్జీవన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.
చాలా కాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త పోస్టులను ప్రభుత్వం (Govt) భర్తీ చేసింది. తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎ. రాజశేఖర్ రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ జగ్జీవన్ కుమార్, హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్, హెచ్‌ఆర్సీ సభ్యులుగా శివాడి ప్రవీణ, బి.కిషోర్‌ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా వీరి నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు గత శనివారం గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.