వారిని రాజకీయాల్లోకి లాగొద్దు.. అలా చేస్తే మేము ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది: మంత్రి పొన్నం

by Mahesh |
వారిని రాజకీయాల్లోకి లాగొద్దు.. అలా చేస్తే మేము ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది: మంత్రి పొన్నం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana assembly meetings) బుధవారం కొనసాగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో (Budget meetings) భాగంగా ఈ రోజు 10 రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (BRS MLA Palla Rajeshwar Reddy), మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మధ్య మాటల యుద్దం (War of words) జరిగింది. ప్రశ్నొత్తరాల్లో భాగంగా.. సభలో ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం ఘటనపై మాట్లాడిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. రాజధాని నగరంలో యువతిపై అత్యాచారయత్నం జరిగి రెండు రోజులు అవుతున్న.. నిందితుడిని పట్టుకోలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

కాగా ఎమ్మెల్యే పల్లా వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పందిస్తూ.. హైదరాబాద్ లోక్ ట్రైన్ అయిన ఎమ్ఎమ్‌టీఎస్‌లో జరిగిన ఘటనలో నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారని సమాధానం ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులకు సంబంధించి సంస్కరణలు చేసిందని.. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్‌..నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు. రాష్ట్ర పోలీసులు రాజకీయాల్లోకి లాగొద్దని.. ఎవరైనా పోలీసులను ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని నడిపితే.. గత బీఆర్‌ఎస్‌లా తాము ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు.

Advertisement
Next Story