- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > పదో తరగతి పరీక్ష పత్రం లీక్.. పరీక్ష సెంటర్లోకి ఫోన్ ఎలా వచ్చింది..?
పదో తరగతి పరీక్ష పత్రం లీక్.. పరీక్ష సెంటర్లోకి ఫోన్ ఎలా వచ్చింది..?
by Aamani |

X
దిశ, నకిరేకల్ : నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్డు లోని ఎస్ఎల్బీసీ గురుకుల బాలుర పాఠశాలలో పదో తరగతి పరీక్ష పత్రం లీక్ అయింది. పరీక్ష ప్రారంభమైన పది నిమిషాలకే ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ప్రత్యక్షంగా తెలుస్తోంది. పోలీసులు విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నప్పటికీ పరీక్ష సెంటర్లోకి ఫోన్ ఎలా వచ్చింది అనేది తెలియ రావడం లేదు. లీకేజీ వ్యవహారం వెలుగులోకి రాగానే విద్యా శాఖ ఉన్నతాధికారులు గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సెల్ ఫోన్ ఎలా వెళ్ళిందని దానిపై విచారణ చేపట్టారు.
Next Story