- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యూట్యూబ్‌లో ట్రెండింగ్ వన్‌గా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫస్ట్ సింగిల్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే..

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. అలాగే తెలుగులోనూ మంచి మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ఏజ్‌లో కూడా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం అజిత్ నటిస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly). 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్(Trisha Krishnan) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్(Sunil), అర్జున్ దాస్(Arjun Das), రాహుల్ దేవ్(Rahul Dev) కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ‘ఓజీ సంభవం’ పేరుతో ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ వన్‌గా నిలిచింది. అంతేకాకుండా ఇప్పటి వరకు 20+ మిలియన్ల వ్యూస్‌ను రాబట్టి దూసుకుపోతుంది. ఇక ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించడం విశేషం.