దారుణ సంఘటన.. దారికాచి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగులు

by Mahesh |
దారుణ సంఘటన.. దారికాచి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారో దారుణ సంఘటన (Bad incident) చోటు చేసుకుంది. తెల్లవారుజామున పొలం పనులకు వెళ్లి వస్తుండగా.. దారి కాచిన దుండగులు దారుణంగా హత్య (murder) చేశారు. ఈ ఘోరమైన సంఘటన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా (Anantapur District) లోని నారాయణపురం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు మండలం, లింగాపూర్‌కు చెందిన రైతు, వైసీపీ కార్యకర్త అయిన సుధాకర్ రెడ్డి.. నారాయణపురం లో ఉన్న తన పొలానికి వెళ్లి.. పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా దారికాచిన దుండగులు కత్తులతో దారుణంగా దాడి చేశారు. దుండగులు తలపై నరకడంతో సుధాకర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఆధిపత్యపోరే (Dominant) సుధాకర్ రెడ్డి హత్య (Sudhakar Reddy murdered)కు కారణం అని స్థానికులు చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్.. సంఘటన ప్రదేశంలో క్లూస్ సేకరించారు. అలాగే స్థానికుల నుంచి సమాచారం సేకరించి.. సుధాకర్ రెడ్డి హత్య పై దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. గత కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

Next Story

Most Viewed