Bank News: ఏప్రిల్ నుంచి వారానికి 5 రోజులే పనిచేయనున్న బ్యాంకులు ?

by Vennela |
Bank News: ఏప్రిల్ నుంచి వారానికి 5 రోజులే పనిచేయనున్న బ్యాంకులు ?
X

దిశ, వెబ్‌డెస్క్: Bank News: ఏప్రిల్ నుంచి బ్యాంకుల్లో 5 రోజులు మాత్రమే పనిచేస్తాయా. కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఏప్రిల్ 2025 నుంచి దేశంలో అన్ని బ్యాంకులు వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తాయి. శని, ఆదివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. అయితే ప్రభుత్వం ఈ వాదనను తిరస్కరించింది. అలాంటి నిబంధన ఇంకా అమలు చేయలేదని చెబుతోంది. ఈ నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత వచ్చే నెల నుంచి ప్రతి శనివారం బ్యాంకులు మూసి ఉంటాయా లేదా అనే దానిపై బ్యాంకు ఉద్యోగులు, కస్టమర్లలో ఊహాగానాలు తీవ్రం అయ్యాయి. అయితే దీనిని ప్రభుత్వం తిరస్కరించింది.

బ్యాంకు సెలవుల గురించి ప్రభుత్వం ఏం చెప్పిందంటే..ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం ప్రతి శనివారం, ఆదివారం బ్యాంకులు సెలవులు అనే వాదనని అబద్ధమని పేర్కొంది. దేశ్యవాప్తంగా బ్యాంకులు ఏప్రిల్ 2025 నుంచి 5 రోజులు మాత్రమే పనిచేస్తాయని ఒక నివేదిక తెలిపింది. ఇది కొత్త ఆర్బిఐ నిబంధనల ప్రకారం ఉటుందని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టంగా పేర్కొంది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ ప్రాకరం ఈ వాదన పూర్తిగా అబద్ధం. మీరు ఆర్బిఐకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని https://rbi.org.inలో చూడవచ్చు.

అయితే భవిష్యత్తులో బ్యాంకులు వారానికి 5 రోజులు మాత్రమే పని చేస్తాయా అనే దానిపై ఆర్బిఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోనప్పటికీ బ్యాంకింగ్ యూనియన్లు, అధికారుల మధ్య ఈ అంశంపై నిరంతరం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వం, ఆర్బిఐ ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే బ్యాంకు ఉద్యోగులు వారానికి 5 రోజులు మాత్రమే పనిచేసే సౌకర్యాన్ని పొందవచ్చు.



Next Story

Most Viewed