ఎన్నికల్లో వార్ వన్ సైడే..!

by Shyam |
ఎన్నికల్లో వార్ వన్ సైడే..!
X

దిశ, అంబర్‎పేట్: రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వార్ వన్ సైడే ఉంటుందని.. వంద సీట్లు గెలుపొంది టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమా వ్యక్తంచేశారు. ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‎లో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ పథక లబ్దిదారులకు కార్పొరేటర్ హేమలత యాదవ్‎తో కలిసి దానం నాగేదర్ చెక్కులను పంపిణీ చేశారు.

రాష్ట్రంలోని బడుగు , బలహీన వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా మారాడని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులతో హడావిడి చేస్తున్నారని మాట్లాడిన ప్రతిపక్షాలపై దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎన్నికలు ముఖ్యం కాదని.. ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యమని అన్నారు.

Advertisement

Next Story