- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చెరువుల కబ్జాల పై హైడ్రా కమిషనర్ సీరియస్..

దిశ, శేరిలింగంపల్లి : గంగారం పెద్ద చెరువు కబ్జాల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం చందానగర్ పరిధిలోని గంగారం పెద్ద చెరువును జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, హైడ్రా సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. చెరువు చుట్టూ ఎక్కడెక్కడ కబ్జాలు జరుగుతున్నాయి. ఎంతమేర మట్టి పోశారు. చెరువులో మట్టి నింపినది ఎవరు అనే దాని పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువు కబ్జాలకు గురవుతుంటే ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిబ్బంది తీరు పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ గంగారం పెద్ద చెరువు ఆక్రమణకు గురవుతుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ ఆరేకపూడి గాంధీ ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చామని, ఇక్కడ గత కొంతకాలంగా చెరువును కబ్జా చేస్తున్నారని, అలాంటి వారి పై చర్యలు తీసుకుంటామని, ఇందుకు సంబంధించి గత మూడు నెలల్లో చెరువులో మట్టి పోస్తూ పూడుస్తున్న పలువురి పై చందానగర్ పోలీస్ స్టేషన్ లో హైడ్రా సిబ్బంది ఫిర్యాదు చేశారని, కేసులు కూడా నమోదు అయినట్లు రంగనాథ్ తెలిపారు. కబ్జాలకు పాల్పడేందుకు ముందుగా చెరువులో మట్టిని పోస్తారని, అనంతరం అక్కడ నిర్మాణాలు మొదలవుతాయని రంగనాథ్ అన్నారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.