- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral video: లిఫ్ట్‌లో ఒక్కసారిగా ఊహించని ప్రమాదం.. బాలుడి ధైర్యానికి ప్రశంసలు!

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో బహుళ అంతస్థు భవనాలకు లిఫ్ట్ (Lift) అనేది సర్వ సాధారణంగా మారింది. మెట్లు ఎక్కలేని వృద్ధులు, పిల్లల కోసం వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, వీటితో సౌలభ్యం ఎంత ఉందో, అదమరిస్తే అంతే ప్రమాదమూ ఉంది. లిఫ్ట్ ప్రమాదాలకు సంబంధించిన ఘటనలూ కూడా గతంలో చాలానే చూశాం. ఈ నేపథ్యంలో లిఫ్ట్‌లో వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే పెద్దలు సైతం భయపడిపోతుంటారు. ఏం చేయాలో తెలియక కంగారుపడిపోతుంటారు. అలాంటిది, ఓ బాలుడికి (Boy) లిఫ్ట్‌లో ఊహించని ప్రమాదం ఎదురవ్వగా.. ఏ మాత్రం భయపడకుండా ఎంతో తెలివిగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ 11 ఏళ్ల బాలుడు తన పెంపుడు కుక్కను తీసుకుని లిఫ్ట్‌లోకి ప్రవేశించాడు. ఆ బాలుడు గమనించకపోవటంతో లిఫ్ట్ డోర్‌లో కుక్క మెడకు కట్టిన తాడు ఇరుక్కుంది. ఇక లిఫ్ట్ పైకి వెళ్లటం ప్రారంభం కాగానే కుక్క కూడా సడెన్‌గా డోర్ పైకి వెళ్లింది. బాలుడు వెంటనే అప్రమత్తమై దాన్ని గట్టిగా పట్టుకోవటంతో బాలుడు కూడా పైకి లేచాడు. ఇంతలో కుక్క తాడును మెడ నుంచి విడిపించుకుని కిందకు దూకింది. అనంతరం బాలుడు కూడా తాడును వదిలేశాడు. అయితే, తాడు డోర్‌లోనే ఉండిపోయింది. దాన్ని విడిపించేందుకు బాలుడు ప్రయత్నించాడు కానీ, సాధ్యం కాలేదు. దీంతో లిఫ్ట్‌లోని ఫోన్ తీసి సాయం కోరారు. ఇదంతా లిఫ్ట్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అవ్వగా.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బాలుడి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. అలాగే, చిన్నపిల్లలను ఇలా ఒంటరిగా లిఫ్ట్‌లో పంపించకూడదని సలహాలు ఇస్తూ కామెంట్లు పెడుతున్నారు.
READ MORE ...
Viral video: ఎవడ్రా వీడు! మరీ ఓపికకు బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడేంటి?