పెళ్ళికి వారం రోజుల ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు .. ఎందుకంటే..?

by Prasanna |   ( Updated:2025-03-21 07:40:52.0  )
పెళ్ళికి వారం రోజుల ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు .. ఎందుకంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : కళ్యాణం( Marriage ) వచ్చినా ఆగదు, కక్కు వచ్చినా ఆగదని పెద్దలు అంటుంటారు. ఎందుకంటే, ఇద్దరికీ ముడి పడాలని రాసి పెట్టి ఉంటే .. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా పెళ్లి జరుగుతుంది. ఒక ఇంట్లో వివాహం అవుతుందంటే చాలు.. సందడి మొదలవుతుంది. అలాగే, పెళ్లి పనులు కూడా మొదలు పెడతారు. అయితే, కొన్ని పనులు చేయకూడదని చాలా మందికి తెలియదు. ఆ పనులు ఏంటి? అసలు ఎందుకు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

పెళ్లికి ముందు వారం నుంచి రాత్రి పూట తాగడం ప్రారంభిస్తారు. కానీ, ఇది మంచి పద్ధతి కాదు అని అంటున్నారు. మద్యాన్ని అదే పనిగా సేవించడం వలన చెమట ఎక్కువగా పడుతుంది. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు .. వారం రోజులు ముందు నుంచే మానేయాలి. లేదంటే, పెళ్లి సమయంలో ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది.

పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ అందంగా కనిపించడం కోసం పార్లర్ చుట్టూ తిరుగుతుంటారు. కానీ, దీని వలన చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. అంతే కాదు, స్కిన్ సెన్సిటివ్ గా మారి ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు, పెళ్లిలో ముఖం అందవికారంగా కనిపిస్తూ ఉంటుంది.

అలాగే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మేకప్ లు లాంటివి వేసుకోకపోవడమే మంచిది. అవి, చర్మానికి పడకపోతే అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా, కొత్త కొత్త ఎక్సరసైజ్ లు ఈ సమయంలో అస్సలు చేయకూడదు. ఎందుకంటే, ఇలాంటి ప్రయోగాలు చేయడం వలన బాడీ పెయిన్స్ వస్తే … దానికి సంబంధించిన ఇబ్బంది మీ ఫేస్ లో కనిపిస్తుంది. అలాగే, కళ్యాణం దగ్గర పడుతున్న మిమల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. బరువులు ఎత్తకూడదు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ సమయానికి నిద్రపోవాలి. నిద్ర తక్కువైనా ముఖంలో కల తగ్గిపోతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

READ MORE ...

ముంతాజ్-షాజహాన్ ప్రేమకు చిహ్నాం తాజ్‌మహాలే కాదు.. ఈ పెర్ఫ్యూమ్‌ కూడా!

ట్రెండింగ్ కల్చర్ : నాలుగు రోజులే పని.. మిగతా రోజులు శృంగారంలో మునిగి తేలడమే..




Next Story

Most Viewed