బస్తీ దవాఖానాల్లో డీఎం అండ్ ఎచ్ఓ తనిఖీలు..

by Sumithra |
బస్తీ దవాఖానాల్లో డీఎం అండ్ ఎచ్ఓ తనిఖీలు..
X

దిశ, శేరిలింగంపల్లి : కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆదేశాల మేరకు గురువారం శేరిలింగంపల్లి జోన్ డీఎం అండ్ ఎచ్ఓ డా.కె.సుధాకర్ లాల్ బస్తీ దవాఖానాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్ చందా నాయక్ తండా, గ్రేటర్ హైదరాబాద్ లోని అర్బన్ పీహెచ్ సీ హాఫిజ్ పేట్ పరిధిలోని ప్రేమ్ నగర్ బస్తీ దవాఖాన, ఎచ్.ఎమ్.టి. కాలనీలోని బస్తీ దవాఖాన, శేరిలింగంపల్లి అర్బర్ పీహెచ్ సీ పరిధిలోని గంగారం బస్తీ దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీలు చేసి రికార్డులను, ప్రజలకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. ఈ సంద్భంగా డీఎమ్ఎచ్ఓ డా. సుధాకర్ లాల్ మాట్లాడుతూ హైదారాబాద్ పరిధిలోని 272 బస్తి దవాఖానల్లో అందుతున్న వైద్య సేవల పై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆదేశాల మేరకు అకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. బస్తీ దవాఖానల్లో అందుతున్న సేవలను పరిశీలిస్తూనే, మరింత నాణ్యమైన వైద్య సేవలందించేందుకు కల్పించాల్సిన సౌకర్యాల పై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.

Next Story