- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ దేవాలయాలు మనకు చాలా నేర్పుతాయి.. విశ్వ సుందరి క్రిస్టినా ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) వేదికగా 72 వ మిస్ వరల్డ్ పోటీలు (Miss World Compitition) జరుగనున్న విషయం తెలిసిందే. దీని కోసం ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. ఈ మిస్ వరల్డ్ పోటీలకు ముందు అధికారులు బేగంపేట్ టూరిజం ప్లాజాలో (Begumpet Touism Plaza) ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ (Pre Event Press Conference) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా (Miss World cristina pijkova) కూడా హాజరయ్యారు. అలాగే టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao), టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
సందర్భంగా విశ్వ సుందరి క్రిస్టినా మాట్లాడుతూ.. ఇండియా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమస్తే ఇండియాతో ప్రసంగం మొదలుపెట్టిన ఆమె.. తెలంగాణలోని దేవాలయాల గురించి మాట్లాడారు. తమ కోసం ఇన్ని ఏర్పాట్లు చేసినందకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇండియా గొప్ప ప్రదేశం అని, 2024 మిస్ వరల్డ్ గా తన ప్రస్థానం ఇండియాతో మొదలైందని చెప్పుకొచ్చారు. అలాగే ఇండియా మనకు చాలా నేర్పుతుందని, ప్రతీ విషయంలో స్పూర్తినిస్తుందని తెలిపారు. అంతేక తెలంగాణలో చాలా దేవాలయాలను సందర్శించానని, ఇక్కడి దేవాలయాలు గొప్ప విలువలను నేర్పుతాయని అన్నారు. ఇక ఇండియాలో ఒక స్పిరిట్ ఉందని, వివిధ మతాల వారు.. వివిధ భాషల వారు కలిసి జీవిస్తున్నారని కొనియాడారు. ఇక్కడ ట్రెడిషన్ కూడా చాలా బాగా నచ్చిందని, ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.