తాగునీటికి తండ్లాడుతున్న మూగజీవాలు..

by Aamani |
తాగునీటికి తండ్లాడుతున్న మూగజీవాలు..
X

దిశ, మంగపేట : నాలుగురోజులుగా ఎండలు 38 నుంచి 40 డిగ్రీలకు చేరడంతో మూగజీవాలకు తాగునీరు లేక తండ్లాడుతున్నాయి. మంగపేట గౌరారం వాగు ఎండి పోవడంతో పశువులు, పక్షులు, కోతులు తాగడానికి నీరు దొరక్కపోవడంతో అల్లాడుతున్నాయి. ఇటీవల మండల కేంద్రానికి వందల సంఖ్యలో కోతులు చేరి నానా హంగామా చేస్తుండగా ప్రజలు నాటిని ఇళ్లలోకి రానివ్వకుండా తరుముతుండడంతో గడచిన రెండు మూడు రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో తాగునీరు కూడా దొరకక అల్లాడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద లీకేజీ అవుతున్న నల్లాల వద్దకు చేరి వాటి దాహార్తిని తీర్చకుంటున్నాయి. పక్షుల దాహార్తిని తీర్చడానికి మండల ప్రజలు అక్కడక్కడ చెట్టకు మట్టి తొట్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ తొట్లను ఏర్పాటు చేసి నీటిని పోసి పక్షి జాతులను రక్షిస్తున్నారు.

Next Story

Most Viewed