Tamannaah Bhatia: ‘ఓదెల-2’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. వైల్డ్ పోస్టర్‌తో అంచనాలను పెంచేస్తున్న మేకర్స్

by Hamsa |
Tamannaah Bhatia: ‘ఓదెల-2’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. వైల్డ్ పోస్టర్‌తో అంచనాలను పెంచేస్తున్న మేకర్స్
X

దిశ, సినిమా: తమన్నా భాటియా(Tamannaah Bhatia) ‘శ్రీ’సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హ్యాపీడేస్, రెడీ,అవారా, 100% లవ్ , ఎందుకంటే ప్రేమంట వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్స్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ప్రభాస్, మహేష్ బాబు(Mahesh Babu), వెంకటేష్ (Venkatesh)వంటి వారితో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్ బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ దక్కించుకుని ఇప్పటికీ తన హవానే కొనసాగిస్తోంది. అయితే ఇటీవల తమన్నా గ్లామర్ డోస్ పెంచి మరీ హద్దులు దాటేస్తోంది.

బోల్డ్ సీన్స్‌తో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. అంతేకాకుండా ఐటమ్ సాంగ్స్‌లో ఆడిపాడి అందరినీ మంత్రముగ్దులను చేస్తోంది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల-2’(Odela-2). అశోక్ తేజయే(Ashok Tejay) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్(Madhu Creations) బ్యానర్‌పై సంపత్ నంది టీమ్ వర్స్‌పై మధు నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా నాగసాధు పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా 2021లో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్‌గా రాబోతుంది.

ఇప్పటికే పలు పోస్టర్స్, టీజర్ విడుదలై అందరిలో క్యూరియాసిటీని పెంచాయి. తాజాగా, మూవీ మేకర్స్ ‘ఓదెల-2’ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో తమన్నా వైల్డ్ లుక్‌లో కనిపించింది. మెడలో నల్లమూసలు వేసుకుని రక్తం కారుతుండగా.. కోపంగా ఉగ్రరూపంలో ఉంది. ఈ పోస్టర్‌లో ఆమె ముఖాన్ని సగం మాత్రమే చూపించి అందరిలో అంచనాలను పెంచారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘చీకటి రాజ్యమేలి ఆశ పడిపోయినప్పుడు, 'శివశక్తి' మేల్కొంటుంది’’ అనే పవర్ ఫుల్ క్యాప్షన్‌ను జత చేశారు.

Next Story

Most Viewed