- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Betting Aap Case: ముగిసిన విష్ణుప్రియ విచారణ.. సంచలన విషయం వెలుగులోకి

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్స్ (Betting Aaps) ప్రమోషన్ వ్యవహారంలో పోలీసులు (Police) విచారణను మరింత వేగవంతం చేశారు. మొత్తం 11 మంది సెలబ్రిటీలు (Celebrities), సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై (Social Media Influencers) పంజాగుట్ట పోలీసులు (Panjagutta PS) ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఇవాళ నటి విష్ణుప్రియ (Vishnupriya), తన అడ్వొకేట్‌తో కలసి పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హజరయ్యారు. ఈ నేపథ్యంలోనే విచారణ సందర్భంగా విష్ణుప్రియ సంచలన విషయాలను వెల్లడించింది. తాను మొత్తం 15 బెట్టింగ్స్ యాప్స్‌కు భారీగా డబ్బులు తీసుకుని ప్రమోషన్ చేసినట్లుగా ఒప్పుకుంది. ఒక్కో వీడియోకు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు తనకు రూ.90 వేలు ఇచ్చినట్లుగా తెలిపింది. ఈ మేరకు విష్ణుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన పంజాగుట్ట పోలీసులు ఆమె ఫోన్‌ను సీజ్ చేశారు.
Read More..