భూగర్భ జలాల వినియోగం.. వాల్టా చట్టంపై అవగాహన

by Sridhar Babu |
భూగర్భ జలాల వినియోగం.. వాల్టా చట్టంపై అవగాహన
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో జిల్లా అధికారులు భూగర్భ జలాల వినియోగం, వాల్టా చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల వినియోగం, నీటిని వెలికి తీసే సమ యంలో నియమాలు నిబంధనలు, నిర్వహణ తదితర అంశాలతో పాటుగా వాల్టా చట్టం నియమ నిబంధనలను తెలియజేశారు. భూగర్భ జలాలను వినియోగించుకునే వారు తప్పనిసరిగా సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీని పొందాల్సి ఉంటుందన్నారు.

వాణిజ్యపరమైన వినియోగదారులు, పరిశ్రమల నిర్వాహకులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్, మైనింగ్ ప్రాజెక్ట్స్, బల్క్ వాటర్ సప్లై ట్యాంకర్స్, 25 వేల లీటర్లకు పైగా నీటిని వినియోగించే పట్టణ నివాస సముదాయాలు తప్పనిసరిగా ఎన్ఓసీ పొందాలని పేర్కొన్నారు. భూగర్భ జలాలను అక్రమంగా వెలికి తీసే వారిని నియంత్రించేందుకు విజిలెన్స్ కమిటీ అధికారులను ఈ సందర్భంగా ప్రతిపాదించారు. రెవెన్యూ అడిషనల్ కలెక్టర్, ఎమ్మార్వో, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్టిక్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్, డిస్టిక్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ అధికారులు విజిలెన్స్ కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. భూగర్భ జల అధికారి హరీష్ బాబు మాట్లాడుతూ ఎన్వోసీ పొందటానికి గ్రౌండ్ వాటర్ రెగ్యులేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం వెబ్సైట్ ద్వారా పొందవచ్చని సూచించారు.

Next Story

Most Viewed