- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Good News: ఏపీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ... ఎక్కడంటే..!

దిశ, వెబ్ డెస్క్: ఏపీ విద్యార్థుల(Ap Students)కు గుడ్ న్యూస్ లభించింది. ఇంటర్నేషన్ యూనివర్సిటీ(International University)కి ఏర్పాటుకు ఏంవోయూ కుదిరించింది. కూటమి ప్రభుత్వం(Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ(Education Department)పై దృష్టి సారింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనిర్సిటీలను అభివృద్ధిని చేయాలని నిర్ణయించింది. దేశీయ యూనివర్సిటీలే కాకుండా అంతర్జాతీయ వర్సిటీలను కూడా రాష్ట్రంలో నెలకొల్పాలని సంకల్పించింది. ఈ మేరకు ప్రయత్నాలు కొనసాగించింది.
అయితే ఈ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇచ్చింది. జార్జియా యూనివర్సిటీ(Georgia University) ఏర్పాటుపై సంప్రదింపులు జరిపింది. యూనివర్సిటీకు కావాల్సిన అనువైన వాతావరణాన్ని వివరించింది. దీంతో ఆ యూనివర్సిటీ నిర్వాహకులు సుముఖత వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర(Uttarandhra)లో జార్జియా యూనివర్సిటీ చేసేందుకు ఒప్పుకున్నారు. రూ.1300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు జార్జియా యూనివర్సిటీ నిర్వాహకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ కుదిరింది. దీంతో త్వరలోనే ఉత్తరాంధ్రలో జార్జియా యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.