పేద ప్రజలకు ఉపశమనం కలిగించాలి : ఎమ్మెల్యే రామచంద్రనాయక్

by Aamani |
పేద ప్రజలకు ఉపశమనం కలిగించాలి : ఎమ్మెల్యే రామచంద్రనాయక్
X

దిశ,డోర్నకల్: మరిపెడ,డోర్నకల్ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను,కమర్షియల్ టాక్స్ లను సవరించాలని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఇక్కడి నాయకున్ని రాజకీయంగా లబ్ధి చేకూర్చాలని ఉద్దేశంతోనే డోర్నకల్,మరిపెడ మున్సిపాలిటీలుగా మార్చడం జరిగింది.కేవలం 12 వేల ఓటర్లే.. చుట్టుపక్కల గిరిజన తండాలను పురపాలకలో కలిపేశారు. సిబ్బందిని,వసతులు కల్పించలేదు.గతంలో ఏర్పడిన మున్సిపాలిటీలకు రెంటల్ బేస్ మీద పన్నులు నియమించారు.థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీలో ప్రాపర్టీ వాల్యూ బేస్ పై పన్నులు అత్యధికంగా వెయ్యడం వల్ల ప్రజల మీద భారం పడుతుంది. సవరించి ప్రజలకు మేలు కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 460 స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు నిబంధనలకు లోబడి ఇంటి నెంబర్లు ఇవ్వాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే కోరారు.

Next Story

Most Viewed