Viral Video: అమెరికా ట్రావెల్ వ్లాగర్‌ను వివాహానికి పిలిచిన ఆటో డ్రైవర్.. వైరల్‌ వీడియో!

by Vennela |   ( Updated:2025-03-27 06:42:56.0  )
Viral Video: అమెరికా ట్రావెల్ వ్లాగర్‌ను వివాహానికి పిలిచిన ఆటో డ్రైవర్.. వైరల్‌ వీడియో!
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: మనదేశంలో పెళ్లంటే గొప్ప వేడుక. వధూవరుల కుటుంబాలు, బంధుమిత్రులు, వచ్చేపోయేవారితో పెళ్లి ఇంటికి వచ్చే కళే వేరుంటుంది. మరి ఈ సీన్ లోకి విదేశీయులు అతిథులుగా ఎంట్రీ ఇస్తే మరింత అద్భుతంగా ఉంటుంది కదూ. అవును ఢిల్లీలో జరిగిన ఓ వివాహ వేడుకకు అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ వచ్చాడు. భారతీయ వివాహానికి హాజరై తాను ఎలా ఎంజాయ్ చేశాడో ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అసలు విషయం ఏంటంటే ఒక అమెరికన్ ట్రావెల్ వ్లాగర్ జాక్ రోసెంతల్ తన స్నేహితులతో కలిసి భారత్ కు వచ్చాడు. ఢిల్లీలో ఓ ఆటోలో తన స్నేహితులతో ప్రయాణం చేస్తుండగా..జాక్ తనకు భారతీయ సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి చూడాలని ఉందని ఆటో డ్రైవర్ రాజుతో చెప్పాడు. అయితే రాజు వెంటనే తన తమ్ముడి పెళ్లి వచ్చే వారం ఉందని.. మీరు మా తమ్ముడి వివాహానికి రావాలని ఆహ్వానించాడు. ఆటో డ్రైవర్ చెప్పిన వెంటనే జాక్ పెళ్లికి వస్తానని చెప్పాడు. అన్నట్లుగానే తన ప్లాన్ అంతా రీషెడ్యూల్ చేసుకుని జాక్ తన స్నేహితులతో కలిసి ఆటో డ్రైవర్ తమ్ముడి వివాహానికి హాజరయ్యాడు.

కుర్తా పైజామా ధరించిన జాక్..ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. మెహందీ, సంగీత్ ఫంక్షన్లలో ఎంజాయ్ చేయడమే కాదు..భారతీయ వంటకాలను ఆస్వాదించడం వరకు ప్రతి వేడుకలోనూ ప్రతిక్షణాన్ని ఆస్వాదించాడు. జాక్ వారి అనుభవాన్ని ఓ వీడియో రూపంలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. భారతీయ సాంప్రదాయ వివాహాన్ని తాను ఎలా ఎంజాయ్ చేశారో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Read More..

అనుకున్నది సాధించాలంటే ఫేక్ స్మైల్ ఉండాల్సిందే


ఈ వైరల్ వీడియోను జాక్ రోసెంతల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా 'jackrosen6' లో పోస్ట్ చేశారు. అయితే క్యాప్షన్ లో ఓ కథను రాసుకొచ్చారు. జాక్ తన స్నేహితులు ఆటో డ్రైవర్ రాజుతో ఎలా గడిపారో వివరించాడు. ఈ వీడియో ఇప్పటికే 583Kవ్యూస్ వచ్చాయి. మన అందమైన దేశంలో మీకు గొప్ప అనుభవం ఉంటుందని నేను ఆశిస్తున్నాను అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అది చాలా అద్భుతంగా ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ థుమ్కాలకు ఆధార్ కార్డు ఇవ్వండి అంటూ ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు.

Next Story

Most Viewed