- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ

దిశ ,నాగిరెడ్డిపేట : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 30 ఏండ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ జరిగిందని మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయకులు కుంటోళ్ల యాదగిరి మాదిగ అన్నారు. సోమవారం మండలంలోని పోచారం గ్రామంలో ఎమ్మార్పియస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మార్చి 20న నిండు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. 30 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం ఫలితం రేవంత్ రెడ్డి హయంలో శాసనసభల్లో బిల్లు ఆమోదం పెట్టారని, ఈ నెల నుండి ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన వర్గీకరణతోనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తొంట సాయిలు మాదిగ, ప్రధాన కార్యదర్శి కుంటోళ్ల రాజు, సహాయ కార్యదర్శి రాజుపేట రవి, ప్రచార కార్యదర్శి, నాగరాజు, కర్రోల బాబు, రాజగళ్ల పద్మారావు, కర్రోళ్ల రాములు, కరోల శ్రీను, కర్రోల్ల ప్రవీణ్, కరోల్ల పద్మారావు, కుంటోళ్ల సాయిలు, భూమయ్య, కిషన్ తోపాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.