- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Adani Group: కేబుల్స్ వ్యాపారంలోకి అదానీ.. జాయింట్ వెంచర్ ఏర్పాటు

దిశ, బిజినెస్ బ్యూరో: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. సంస్థ యాజమాన్యంలోని అదానీ ఎంటర్‌ప్రైఇజెస్ అనుబంధ కచ్ కాపర్ లిమిటెడ్(కేసీఎల్) కేబుల్స్, వైర్ తయారీ కోసం ప్రణీత ఎకోకేబుల్స్ లిమిటెడ్(పీఈఎల్)తో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసినట్టు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా, కొత్తగా ఏర్పడిన ప్రణీత ఎకోకేబుల్స్ కంపెనీలో కచ్ కాపర్‌కు 50 శాతం ఈక్విటీ వాటాను కలిగి ఉంటుంది. గత నెలలో ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కేబుల్స్ తయారీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లో ప్లాంట్ ఏర్పాటు కోసం వచ్చే రెండేళ్లలో రూ. 1,800 కోట్ల పెట్టుబడిని కూడా ప్రకటించింది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ సైతం ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టడంతో ఇప్పటికే ఉన్న కంపెనీలపై ఒత్తిడి పెరిగింది. గురువారం మార్కెట్లో ఆర్‌ఆర్ కేబుల్, కేఈఐ ఇండస్ట్రీస్, హావెల్స్ ఇండియా, ఫినోలాక్స్ కేబుల్స్ వంటి తయారీ కంపెనీల షేర్లలో అమ్మకాలు జరిగాయి.