- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేవ్ సోల్జర్స్ స్టోరీస్ కావాలంటున్న నటుడు
విష్ణు మంచు.. హీరోగా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా.. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతూనే ఉన్నాడు. కానీ, ఒక బిజినెస్‌మ్యాన్‌గా మాత్రం బెస్ట్ అనిపించుకున్నాడు. అయితే మనం ఏ పని చేసినా.. ఎంత గొప్పగా ఎదిగినా.. నిత్యం ముగ్గురికి మాత్రం కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడు విష్ణు. ‘ఒకరు మనకు జన్మనిచ్చిన తల్లి.. మరొకరు అన్నం పెట్టే రైతన్న, ఇంకొకరు దేశ రక్షణ కోసం తన కుటుంబానికి దూరమై సరిహద్దుల్లో కాపలా కాసే వీర జవాన్’. కానీ ఈ ముగ్గురికి కూడా తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు విష్ణు.
తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శమూర్తులైన తల్లులు, కష్ట జీవులైన రైతులను కలుసుకునే అదృష్టం పొందాను కానీ.. ఇప్పటి వరకు వీర జవాన్లను కలుసుకోలేకపోయానని చెప్పాడు. అందుకే భారత ఆర్మీలో తమదైన ముద్రవేసిన బ్రేవ్ సోల్జర్స్ త్యాగాల గురించి ప్రపంచానికి తెలియజేస్తూ.. తనూ తెలుసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పాడు. మీ దగ్గర వీర జవాన్ల త్యాగాల కథలు, వారి ఫొటోలు ఉంటే సోషల్ మీడియా ద్వారా తనకు పంపించాలని కోరారు విష్ణు. ‘ఆ వీరజవాన్ల గాథలను ప్రపంచానికి తెలియజేద్దాం’ అని పిలుపునిచ్చారు.
View this post on Instagram
A post shared by Vishnu Manchu (@vishnumanchu) on May 13, 2020 at 5:41am PDT