- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై యుద్ధం.. మేము సైతం సిద్ధమంటున్న విరుష్క జంట
దిశ, వెబ్‌డెస్క్: కరోనా.. దేశాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి.. ఆసుపత్రిలో బెడ్లు ఫుల్.. శవాలతో స్మశానాలు ఫుల్.. దేశంలో ఆక్సిజన్ నిల్.. ఇది ప్రస్తుత దేశ పరిస్థితి. ఈ మహమ్మారి వలన అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఈ కరోనా మహమ్మారిని అంతం చేయడానికి అందరం కలిసి పోరాడాలని సెలబ్రెటీలు విన్నపాలు చేస్తున్నారు.. ఇంకొంతమంది స్టార్లు ఒక అడుగు ముందుకు వేసి ప్రజల కోసం విరాళాలను సేకరిస్తూ.. తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా విరుష్క జంట కూడా కరోనాపై యుద్ధం ప్రకటించింది. దేశంలో ప్రజల బాధలు చూసి తీవ్ర ఆవేదన కలిగిందని అన్న విరాట్ తన భార్య అనుష్క శర్మతో కలిసి తాను వైరస్‌పై పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇండియన్ ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ కెట్టోతో కలిసి కొవిడ్ రిలీఫ్ ఫండ్ రైజింగ్‌కు ముందుకొచ్చారు. వారం రోజుల్లో రూ. 9 కోట్ల విరాళాలు సేకరించడమే లక్ష్యంగా #InThisTogether క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టిన విరుష్క దంపతులు.. రూ. 2 కోట్లు విరాళంగా అందించారు.
Anushka and I have started a campaign on @ketto, to raise funds for Covid-19 relief, and we would be grateful for your support.
Let’s all come together and help those around us in need of our support.
I urge you all to join our movement.
Link in Bio! 🙏#InThisTogether pic.twitter.com/RjpbOP2i4G
— Virat Kohli (@imVkohli) May 7, 2021
కరోనా రెండో దశ విజృంభణపై దేశం పోరాటం చేస్తుంది. ఈ సమయంలో మా వంతుగా విరాళాలు సేకరించాలని అనుకుంటున్నాం అని స్పష్టం చేశారు. దీనికి సంబందించిన ఒక వీడియోను విరాట్ పోస్ట్ చేశారు. “కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభించింది. ప్రజలను కాపాడడానికి వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎంతగానో కష్టపడుతున్నారు. వారికి మనం అండగా ఉండాలి. అందుకే అనుష్క, నేను .. కెట్టోతో కలిసి ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్‌నుప్రారంభించాము. మీరిచ్చే ఒక్క రూపాయైనా ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరం కలిసికట్టుగా ఉండి.. కరోనాను అంతమొందిద్దాం.. మా ఉద్యమంలో చేరాలని మీరందరినీ కోరుతున్నామని” విరుష్క తెలిపారు.