నేనే బాహుబలి.. భారత్ వచ్చేస్తున్నా!

by vinod kumar |   ( Updated:2020-02-23 05:13:10.0  )
నేనే బాహుబలి.. భారత్ వచ్చేస్తున్నా!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు ముందు ఆయన అభిమానులు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నారు. దేశమంతటా సూపర్ బ్లాస్టర్‌గా నిలిచిన బాహుబలి సినిమా క్లిప్‌ను మార్ఫ్ చేసి ప్రధాన పాత్రదారుడికి డొనాల్డ్ ట్రంప్‌ ముఖాన్ని చేర్చి అతన్ని బాహుబలిని చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో జీయో రే బాహుబలి అని పాట వినిపిస్తుండగా.. ట్రంప్ శత్రువులను చీల్చి చెండాడుతున్న ఈ క్లిప్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నది. ఈ వీడియో క్లిప్‌లో ట్రంప్‌తోపాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్, అలాగే, కూతురు, కొడుకు ఇవాంక ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ చిత్రాలు కనిపించాయి. ఒకచోట మన ప్రధాని మోడీ ముఖమూ కనిపించింది.

ఈ క్లిప్‌పై ట్రంప్ కూడా స్పందించి రీట్వీట్ చేశారు. భారత్‌లోని మా గొప్ప మిత్రులను కలవడానికి ఆసక్తిగా ఉన్నారంటూ పేర్కొన్నారు. ఈ వీడియో క్లిప్ పోస్ట్ అయిన రెండు గంటల్లోపే దాదాపు 17వేల మంది షేర్ చేశారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Advertisement

Next Story