అడివిలో ఐసోలేషన్ కేంద్రం

by Sridhar Babu |
అడివిలో ఐసోలేషన్ కేంద్రం
X

దిశ,కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యత్నారం, పెగడపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా కరోనా విజృంభిస్తుండడంతో ఆ గ్రామాలను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. వీటిని కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించిన కొద్ది రోజుల వ్యవధిలోనే యత్నారం గ్రామంలో 34 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఒక్కో కుటుంబంలో ముగ్గురు నుంచి నలుగురికి కరోనా సోకింది కాగా ఇండ్లు ఇరుకుగా ఉండడంతో ఇంట్లో ఉన్న మిగతా వారికి కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఏడు కుటుంబాలకు చెందిన సుమారు 20 మంది బాధితులు ముందస్తుగా గ్రామానికి దూరంగా వెళ్లి నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

వాగుల వెంబడి అటవీ ప్రాంతంలోని చెట్ల కింద ఆవాసం ఏర్పాటు చేసుకుని, అటవీ ప్రాంతాన్ని ఐసోలేషన్ కేంద్రంగా చేసుకున్నారు. అక్కడే కొంతమంది వంటలు చేసుకుంటుండగా, ఇంకొంతమందికి వారి కుటుంబ సభ్యులు ఇంటినుండి ఆహారం పంపిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు మా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయం తెలుసుకున్న సంజీవని సేవా సమితి సభ్యులు గురువారం వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కరోనాతో బాధపడుతున్న సమయంలో సంజీవని సేవా సమితి సభ్యులు నిత్యావసర సరుకులు ఇచ్చి మాకు భరోసా కల్పించిన తీరు ఆనందంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed