- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు:విజయశాంతి
ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నటి విజయశాంతి అటు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆరేళ్లయింది. ఇప్పుడామె ప్రస్థానం ఏడో ఏడాదిలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా విజయశాంతి ఫేస్‌బుక్‌లో స్పందించారు. అప్పట్లో తాను సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పటి ఫొటోను పంచుకున్నారు. ఫిబ్రవరి 25కి కాంగ్రెస్‌లో చేరి ఆరేళ్లయిందని వెల్లడించారు. తనకు మద్దతుగా నిలిచిన ఏఐసీసీ, పీసీసీ, సీఎల్పీ నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు అంటూ పోస్టు చేశారు. తనకు మొదటి నుంచి నిర్మాణాత్మక ఉద్యమాలు అలవాటనీ, ప్రజాక్షేత్రంలో నిర్వహించాల్సిన పోరాటాలకు మరికాస్త దూకుడు అవసరమని భావిస్తుంటానని పేర్కొన్నారు. గతంలో తాను చేపట్టిన ప్రజాపోరాటాలకు హైకమాండ్ అండదండలు ఉన్నా, పరిస్థితుల కారణంగా అనేక మార్పులు చవిచూడాల్సి వచ్చిందని వివరించారు. తన కార్యాచరణను మరోసారి సమీక్షించుకుని భవిష్యత్ కార్యకలాపాలను ప్రజా సంక్షేమానికి అనుగుణంగా తీర్చిదిద్దుకుంటానని వెల్లడించారు.