- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మమ్మల్ని రెన్యూవల్ చేయండి..
ప్రభుత్వ టీచర్లతో సమానంగా పనిచేసే విద్యా వలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసులను మాత్రమే నిర్వహిస్తుండటంతో విద్యా వలంటీర్ల నియామకం చేపట్టలేదు. దీంతో టీచింగ్ ఫీల్డ్‌నే నమ్ముకుని ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. తమను మళ్లీ రెన్యూవల్ చేయాలని కోరుతున్నారు.
దిశ, డోర్నకల్: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతను అధిగమించడానికి విద్యావలంటీర్లను ఏటా విద్యా సంవ త్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ 23 వరకు నెలకు రూ.12 వేల వేతన ఒప్పందంతో విధుల్లోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా లో సుమారు 270 మంది విద్యావలంటీర్లు ఉన్నారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో వచ్చిన వారు చివరి వరకు కొనసాగుతున్నారు. ఆ తర్వాత విద్యా సంవ త్సరం ప్రారంభంలో రోస్టర్, రూల్ ఆఫ్ ఆర్డర్ విధానంలో కొత్తగా నియామకాలను చేపట్టేవారు. 2018లో తమనే ఏటా రెన్యూవల్ చేసి కొనసాగించాలని విద్యా వలం టీర్లు హైకోర్టును ఆశ్రయించగా 2019-2020 విద్యా సంవత్సరానికి అంతకు ముందు పని చేసిన విద్యా వలంటీర్లనే కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చే సింది. దీనితో ప్రభుత్వం గతేడాది వీవీలను రెన్యూవల్ చేసింది. కరో నా కారణం గా మార్చి నెలలోనే పాఠశాలలను మూసివేశారు.
ఆన్‌లైన్ తరగతుల కారణం..
2020-2021 విద్యా సంవత్సరంలో విద్యార్థులు నష్ట పోకుండా ఉండడానికి సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తోంది. దీనికి ప్రభుత్వ ఉపాధ్యాయులు గత నెల 27 నుంచి విధులకు హాజరవుతున్నారు. విద్యా సంవత్సరం పునఃప్రారంభమై వారం రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో విద్యా వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. పెండింగ్ వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. లాక్‌డౌన్ నాటి నుంచి నేటి వరకు ఎలాంటి ఉపాధి లేక కుటుంబ పోషణ భారంగా మారిందని పలువురు విద్యా వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది వీవీలు వ్యవసాయ పనులు చేసుకుంటుండగా కొందరు కూలిపనులకు వెళ్తున్నారు.
రెన్యూవల్ చేయాలి..
విద్యా వాలంటీర్లను రెన్యూవల్ చేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాం. గతేడాది వారినే కొనసాగించాలని కోరుతున్నా.
-సీత సంతోష్, టీవీవీఎస్ జిల్లా అధ్యక్షుడు
సగం జీతమైనా చాలు..
సగం జీతం ఇచ్చినా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కరోనా నేపథ్యంలో ఎలాంటి పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. పూట గడవడమే కష్టంగా మారడం తో అప్పుల పాలు అవుతున్నాం.
-జరుపుల వినోద్, విద్యావలంటరీ