‘వేయి శుభములు కలుగు నీకు’ టీజర్ రిలీజ్

by Shyam |   ( Updated:2020-09-04 09:22:34.0  )
‘వేయి శుభములు కలుగు నీకు’ టీజర్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘వేయి శుభములు కలుగు నీకు’. జయదుర్గ దేవి మల్టీ మీడియా పతాకంపై తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న మూవీకి రామ్స్ రాథోడ్ డైరెక్టర్. తమన్నా వ్యాస్, జ్ఞాన ప్రియ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే నాని, నాగ శౌర్య చేతుల మీదుగా విడుదల కాగా, శుక్రవారం విజయ్ రాజా పుట్టినరోజును పురస్కరించుకుని హీరో సునీల్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ కెరీర్ స్టార్టింగ్‌లో తను మొదట కలిసింది శివాజీ రాజానే అని, చాలా హెల్ప్ చేశారని తెలిపాడు. విజయ్ చిన్నప్పటి నుంచి తెలుసు అని, మంచి వ్యక్తి అని.. సినిమా టైటిల్ కూడా పాజిటివ్‌గా ఉందని చెప్పాడు. మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

శివాజీ రాజా మాట్లాడుతూ తనను ఆశీర్వదించినట్లే తన కొడుకును కూడా ఆదరించాలని ప్రేక్షకులను కోరాడు. విజయ్ ఫస్ట్ సినిమాకు మంచి నిర్మాత, దర్శకులు దొరికారని, మూవీ చాలా బాగా వచ్చిందని తెలిపాడు. టీజర్ అద్భుతంగా ఉందని, చిత్రం ఘన విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. తన పుట్టినరోజున ‘వేయి శుభములు కలుగు నీకు’ టీజర్ రిలీజ్ చేసిన సునీల్‌కు కృతజ్ఞతలు తెలిపారు విజయ్ రాజా. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మిస్తున్న తూము నర్సింహ పటేల్, డైరెక్టర్ రామ్స్ రాథోడ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. త్వరలోనే ఇదే టీంతో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. కాగా, శివాజీ రాజా, సత్యం రాజేష్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న సినిమాకు జ్ఞాని సింగ్ సంగీతం సమకూర్చగా, శ్రీనాథ్ రెడ్డి కథ, మాటలు అందించారు.

Advertisement

Next Story