పేదల పాలిట శాపంగా మారుతున్న ధరలు.. కొనలేక తినలేక..

by Shyam |
vegtables
X

దిశ, బొంరాస్‌పేట్: పెరిగిన కూరగాయల ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా(దయనీయంగా) మారింది. రైతులు సాగు చేసిన కూరగాయల పంటలు వరుస వర్షాలతో పాడయ్యాయి. దీనితో కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగాయి. కరోనా కారణంగా సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో పెరిగిన ధరలు దడ పుట్టిస్తున్నాయి. బొంరాస్ పేట్, తుంకిమెట్ల, కోడంగల్ ప్రాంతాల మార్కెట్‌లలో ఏది కొందామన్నా కిలోకు రూ.50 కు తగ్గకుండా ఉన్నాయి. పచ్చిమిర్చి రూ. 60, కాకరకాయ రూ.80, క్యారెట్ రూ.60, బీరకాయ రూ.80, బంగాళదుంప రూ.50, బెండకాయ రూ.60, క్యాబేజీ రూ. 60, బీట్రూట్ రూ.60 పలుకుతున్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూరగాయలు కొనేందుకు వెనకాడుతున్నారు. కొనలేక, తినలేక కిలో కొనుగోలు చేసేవారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed