బీజేపీ అభ్యర్థితో టీఆర్ఎస్‌కు లాభం: ఉత్తమ్

by Shyam |
బీజేపీ అభ్యర్థితో టీఆర్ఎస్‌కు లాభం: ఉత్తమ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఓ కమిట్‌మెంట్ ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్‌కు లబ్ది చేకూర్చడం కోసమే బీజేపీ బలహీన అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. సాగర్ అభివృద్ధి చెందాలంటే జానారెడ్డిని గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. తెలంగాణ పరువు తీసేలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఇరుక్కోవడం దారుణమన్నారు. ఆ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సాగర్ ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story