‘ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది’

by Shyam |
‘ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది’
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ ప‌ట్టణవాసుల‌కు విమానాశ్రయాన్ని తీర‌ని క‌ల‌గా మార్చిన ఘ‌న‌త ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌ని పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా గురువారం ఎమ్మెల్సీ అభ్యర్థి రాములునాయ‌క్‌తో క‌ల‌సి ఆయన కేయూలో ప్రచారం చేశారు. అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని ప్రజలంతా అనుకున్నారని, అందుకు విరుద్ధంగా జరుగుతోందని మండిపడ్డారు.

బయ్యారం ఉక్కు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ను టీఆర్ఎస్ అడగదు… బీజేపీ ఇవ్వదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్, బీజేపీలు తోడు దొంగలేనని ఎద్దేవా చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కాంగ్రెస్ పోరాటానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎప్పటికైనా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తామని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ నిర్మించక పోవటానికి కారణం ప్రైవేటీకరణ చేయడమేనని చెప్పారు. కమీషన్లు వచ్చే పనులు మాత్రం త్వరగా చేస్తారని చెప్పారు.

Advertisement

Next Story