- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహన రుణాల వ్యవహారంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు షాక్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (HDFC Bank)కు భారీ షాక్ తగిలింది. అమెరికాకు చెందిన న్యాయ సంస్థ రోసెన్ లా (Rosen Law)బ్యాంకుపై వ్యాజ్యం దాఖలు చేసింది. పెట్టుబడిదారులకు (Investors)తప్పుదోవ పట్టించే వ్యాపార వివరాలు ఇచ్చినట్టు, వాస్తవాలను దాచినట్టుగా బ్యాంకుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (HDFC Bank)పై వాటాదారుల తరపున దావాను వేస్తున్నట్టు ప్రకటించింది.
వాటాదారుల తరపున సెక్యూరిటీ క్లెయిమ్స్ (Security Claims)పై విచారణ చేయనున్నట్టు వెల్లడించింది. బ్యాంకు సెక్యూరిటీ (bank securities)లను కొనుగోలు చేసిన వాటాదారులు (Shareholders) దీనికి మద్దతు ఇవ్వాలంటూ కోరింది. అలాగే, ఫిర్యాదుల నమోదుకు వెబ్‌సైట్ (Website)సమాచారాన్ని ఇచ్చింది. జులై 13న హెచ్‌డీఎఫ్‌సీ వాహన ఫైనాన్సింగ్ విభాగం (HDFC Vehicle Financing Division)లో తప్పుడు విధానాలపై దర్యాప్తు జరిపామని బ్యాంకు తెలిపిన రోజుల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
వాహన రుణాల టార్గెట్ (Auto Loan Target)ను చేరుకునేందుకు అవలంబించిన విధానాలపై ఆరోపణలు ఎక్కువవడంతో, ఈ అంశంపై దర్యాప్తు చేసిన బ్యాంకు.. సీనియర్, మధ్య స్థాయి అధికారులను తొలగించింది. ఈ పరిణామాలతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు (HDFC Bank Shares) ఏకంగా 2 శాతం వరకూ పడిపోయాయి. ఇన్వెస్టర్ల (Investors)కు నష్టం వాటిల్లకుండా, వీరికి ప్రయోజనాలను కల్పించే రోసెన్‌లా (Rosen Law)తాజా నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎక్స్‌పీరియన్ (Credit Information Bureau Experience)ఈ అంశం గురించి బ్యాంకుపై ఆర్‌బీఐ (RBI)కి ఫిర్యాదు చేసింది. బ్యాంకు రుణాలు (Bank loans)తీసుకున్న వినియోగదారుల వివరాలు, లావాదేవీ (Customer details, transaction)ల సమాచారాన్ని ఆలస్యంగా ఇస్తున్నట్టు ఫిర్యాదులో స్పష్టం చేసింది.
అలాగే, రానున్న ఆర్థిక సంవత్సర ఆర్థిక ఫలితాల (Financial results for the financial year)పై కూడా సందేహాలను వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయంగా పెట్టుబడిదారులకు , వాటాదారు(international investors, Shareholders )లకు భద్రత కల్పించే రోసన్‌లా (Rosen Law) సంస్థ దావా వేయడం సంచలన విషయంగా మారింది. ఇదే సంస్థ గతంలో టెక్ దిగ్గజమైన ఇన్ఫోసిస్ (Infosys) ఆదాయం, లాభాలను (Income, profits)పెంచుకోవడానికి, సంస్థలోని ఉన్నతస్థాయి అధికారులు తప్పుడు విధానాలను చేపట్టినట్టు దావా వేసిన సంగతి తెలిసిందే.