ముక్కోటికి సర్వం సిద్ధం

by Sridhar Babu |
ముక్కోటికి సర్వం సిద్ధం
X

దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈనెల 31 నుండి ప్రారంభం అయ్యే శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు అన్ని పనులు పూర్తి చేసి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు రామాలయం ఈఓ రమాదేవి పేర్కొన్నారు. బుధవారం ఆలయ ప్రాంగాణంలోని చిత్రకూట మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈఓ మాట్లాడుతూ మొత్తం కోటి 20 లక్షల రూపాయలతో ముక్కోటి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. భక్తులకు కనువిందు చేయడానికి ఈసారి ప్రత్యేకంగా రూ. 18 లక్షలతో లేసర్ షో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి జనవరి 9న జరిగే తెప్పోత్సవం, 10న జరిగే ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకోవడానికి భద్రాచలం వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈఓ తెలిపారు.

ముఖ్యంగా శీగ్ర దర్శనంతో పాటు అందరికి ప్రసాదం అందించాలని రెండు లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. ప్రసాదం అందరికీ అందేలా అదనపు కౌంటర్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అధ్యయనోత్సవాలలో భాగంగా ఈనెల 31 నుండి జనవరి 8వ తేదీ వరకు ఉత్తర ద్వారం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. ఉత్తర ద్వారంలో స్వామి వారిని దర్శించడానికి సుదూర ప్రాంతాలలో ఉన్న భక్తుల సౌకర్యార్ధం రూ. 2 వేల విలువైనవి 650 టికెట్స్, రూ. 1000వి 200 టికెట్స్, రూ. 500వి 665 టికెట్స్, రూ. 250 విలువకలవి 325 టికెట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఇవి కాకుండా రామాలయంలో సీఆర్ఓ కార్యాలయంలో కూడా భక్తులు నేరుగా పొందేలా టికెట్స్ అందుబాటులో ఉంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు విజయ రాఘవన్, రామం, ఏఈఓ భవాని రామకృష్ణ, ఈఈ రవీందర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed