‘పండుగలు మనుషులను దగ్గర చేయడానికే’

by Aamani |
‘పండుగలు మనుషులను దగ్గర చేయడానికే’
X

దిశ, హిమాయత్ నగర్ : పండుగలు మనుషులను దగ్గర చేయడానికే కానీ గొడవలు పడటానికి కాదని తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డా. సుధాకర్ అన్నారు. ఆప్ రాష్ట్ర కార్యాలయంలో మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ సలీం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ సలీం మాట్లాడుతూ.. పండుగలు జరుపుకోవడం మనుషుల మధ్యన అవగాహన పెరగడానికి ఉపయోగపడతాయని అన్నారు. డా. సుధాకర్ మాట్లాడుతూ.. అన్ని కులాలు, మతాలు సమానమైనవన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆఫ్ ది పార్టీ మహిళా వింగ్ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యమునా గౌడ్, పార్టీ యువజన విభాగం అధ్యక్షులు విజయ మల్లంగి, అధికార ప్రతినిధి జావిద్ షరీఫ్. అబ్బాస్ అహసాన్, సోషల్ మీడియా, మొహమ్మద్ బాజీ బాబా,జై సింగ్ యాదవ్, అజీమ్ పాషా, కొడంగల్ శీను, విశాలి, భార్గవి, హర్షిత, అప్స సలీం, ధర్మేంద్ర తివారి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed