- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూనికార్న్ హోదాకు చేరువలో ఎడ్‌టెక్ స్టార్టప్ 'అప్‌గ్రాడ్'!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ సంస్థ ‘అప్‌గ్రాడ్’ త్వరలో 400 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 2,970 కోట్లు) నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఈ నిధుల ద్వారా కంపెనీ యూనికార్న్ సంస్థల జాబితాలోకి చేరే అవకాశం లభిస్తుంది. దీనికోసం ప్రైవేట్ ఈక్విటీతో పాటు వెంచర్ కేపిటల్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ నిధుల సమీకరణ అనంతరం ‘అప్‌గ్రాడ్’ మార్కెట్ విలువ పది రేట్లు పెరిగి 4 బిలియన్ డాలర్ల(రూ. 30 వేల కోట్ల)కు చేరుకోనుంది. 2015లో ప్రారంభమైన ‘అప్‌గ్రాడ్’కంపెనీ ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత ఏడాదిలో ఈ కంపెనీ రెండు దశల్లో 160 మిలియన్ డాలర్ల(రూ. 1,200 కోట్ల)ను సేకరించింది. దీని ద్వారా కంపెనీ విలువ 850 మిలియన్ డాలర్ల(రూ. 6,315 కోట్ల)కు చేరింది. దీనిపై స్పందించిన కంపెనీ చైర్మన్ రోనీ స్క్రూవాలా.. రానున్న రెండు మూడు నెలల్లో ఈ రంగంలోని చిన్న కంపెనీలను కొనే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘అప్‌గ్రాడ్’ సంస్థ ప్రముఖ వీడియో ఎనేబుల్‌డ్ లెర్నింగ్ పరిష్కారాల సంస్థ ఇంపార్టస్‌ను రూ. 150 కోట్లకు కొనుగోలు చేసింది. తాము ఉన్న రంగంలో యూనికార్న్ జాబితాకు మించిన లక్ష్యాన్ని కలిగి ఉన్నామని రోనీ వెల్లడించారు.