బెజ్జికల్‌తో దారుణం.. కరెంట్ తీసేసి ఇంటిపై కత్తులతో దాడి

by Sumithra |   ( Updated:2021-09-20 12:13:04.0  )
murder
X

దిశ, హాలియా: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన జిల్లాలోని త్రిపురారం మండలం బెజ్జికల్ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామంలో వినాయక నిమజ్జనం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కరెంట్ తీసేసి గ్రామానికి చెందిన దుబ్బపెళ్లి సంత్య అలియాస్ బొర్రయ్య(42) ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన సత్యం అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకొని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాత కక్షల నేపథ్యంలోనే సత్యాన్ని హత్య చేసినట్లు పోలీసులు ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

Advertisement

Next Story