విషాదం.. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి

by  |   ( Updated:2021-10-26 00:44:55.0  )
Nizamabad-died-persons1
X

దిశ, నిజామాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదానికి గురై ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన నిజామాబాద్ డిచ్ పల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన ఈగ శ్రీనివాస్ రెడ్డి, ఈగ పెద్ద గంగారెడ్డి కలిసి ట్రాక్టర్ కు సంబంధించిన వస్తువుల కోసం సోమవారం రాత్రి ఆర్మూర్ బయల్దేరి వెళ్లారు. వెళ్లే క్రమంలో జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యారు. వెళ్తున్న క్రమంలో ట్రక్కు వెనుక నుంచి ఢీనకొడంతో శ్రీనివాస్ రెడ్డి(45) అక్కడికక్కడే మృతి చెందగా ఈగ పెద్ద గంగారెడ్డి (65)కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంగారెడ్డి కూడా మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Next Story