- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్టరాయిడ్‌ను కనుగొన్న సూరత్ బాలికలు
దిశ, వెబ్‌డెస్క్ : గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులు.. అత్యంత దగ్గరగా ఉన్న ఓ గ్రహశకలాన్ని (ఉల్క) కనిపెట్టారు. ఈ విషయాన్ని ‘నాసా’నే స్వయంగా ధ్రువీకరించింది. దానికి నాసా హెచ్‌ఎల్‌వీ 2514 (HLV2514) అని పేరు కూడా పెట్టింది. సూరత్‌లో పదో తరగతి చదువుతున్న ‘వైదేహి వెకారియా సంజయ్‌భాయ్, రాధిక లఖాని ప్రఫుల్‌భాయ్’.. వీరిద్దరూ ఇటీవల స్పేస్ ఇండియా నిర్వహించిన ‘ఆల్ ఇండియా ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్ 2020’ రెండు నెలల క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు హవాయిలోని పాన్‌స్టార్ టెలిస్కోప్ సాయంతో గ్రహశకలాన్ని గుర్తించారు.
టెక్సాస్‌లోని హార్డిన్ సిమన్స్ యూనివర్సిటీ సహకారంతో స్పేస్ ఇండియా, ఇంటర్నేషనల్ అస్ట్రానామికల్ సెర్చ్ కొలాబరేషన్(IASC)లు సంయుక్తంగా ఈ సైన్స్ ప్రొగ్రామ్‌ను నిర్వహించాయి. ‘సూరత్‌కు చెందిన ఇద్దరు బాలికలు రాధిక, వైదేహీలు స్పేస్ ఆల్ ఇండియా ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్ సహాయంతో కొత్త ఆస్టరాయిడ్ కనుగొన్నందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఆ ఇద్దరు బాలికలకు అభినందనలు.. వారు భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని కోరుకుంటున్నాం’ అని స్పేస్ ఇండియా తెలిపింది.