సేతుపతితో రాశి జర్నీకి ఫుల్‌స్టాప్!

by Shyam |
సేతుపతితో రాశి జర్నీకి ఫుల్‌స్టాప్!
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ స్టార్ విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ షూటింగ్ పూర్తైంది. ఈ మేరకు లాస్ట్ డే షూటింగ్‌లో పాల్గొన్న హీరోయిన్ రాశీ ఖన్నా.. సెట్స్ నుంచి ఫొటోలు షేర్ చేసింది. సేతుపతితో కలిసిన పిక్స్ అభిమానులతో పంచుకున్న భామ.. మరో బ్యూటిఫుల్ జర్నీ ఎండ్ అయిందని తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ను మెమొరబుల్‌గా మలిచిన డైరెక్టర్ ఢిల్లీ ప్రసాద్ దీన్‌దయాళ్‌కు థాంక్స్ చెప్పింది. ఈ సినిమాను థియేటర్‌లో చూసేందుకు ఎగ్జైట్ అవుతున్నట్లు తెలిపింది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్‌ నిర్మిస్తున్న సినిమాలో ముందుగా అదితి రావు హైదరీని హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినా.. తను ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడంతో.. రాశి ఆ ప్లేస్‌ను భర్తీ చేసింది.

కాగా రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని సమాచారం. రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో షాహిద్ కపూర్ మెయిన్ రోల్ ప్లే చేస్తున్న సిరీస్‌లో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సిరీస్‌తోనే వీరిద్దరు డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Advertisement

Next Story