- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో టీఎస్ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేసే టీఎస్ఆర్టీసీ ఇటీవలే కార్గో సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా, మరో అడుగు ముందుకేసి రాష్ట్రవ్యాప్తంగా డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మొదటగా హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో ఈ స్కూల్స్‌ను ఏర్పాటు చేసేలా ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
లాక్‌డౌన్ సమయంలో ఆర్టీసీ సుమారు రూ.700 కోట్లు నష్టపోయింది. ప్రస్తుతం పరిమితి సంఖ్యలో బస్సు సర్వీసులను నడుపుతున్నా.. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ఆర్టీసీని నష్టాల బారి నుంచి గట్టేక్కించేందుకు ప్రత్యామ్నాయంగా త్వరలోనే మూడు డ్రైవింగ్ స్కూల్స్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ శిక్షణా కేంద్రాల్లో కార్ల దగ్గర నుంచి భారీ వాహనాల వరకు అన్నింటిని నడిపే విధంగా శిక్షణ ఇవ్వనుంది. కాగా, ఈ డ్రైవింగ్ స్కూల్స్‌లో శిక్షణకు ఇంకా ఫీజు నిర్ణయించలేదు. అటు మొత్తం శిక్షణ 40 రోజులు ఉండేలా.. అందులో 10 రోజులు థియరీ క్లాసులు, 30 రోజులు ప్రాక్టికల్స్ ఉండేలా అధికారులు షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు.