కుట్రపూరిత కోతలు విధిస్తున్నారు

by Shyam |   ( Updated:2020-05-09 09:33:03.0  )

• తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్

దిశ, న్యూస్‌బ్యూరో:
రైతులపై భారం వేస్తూ ఎక్కువ శాతం బియ్యం విగుల్చుకునేందుకు మిల్లర్లు కుట్రపూరితంగా తూకాలను తగ్గిస్తున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ ఆరోపించారు. ఈ విషయమై ఆయన శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఓ వైపు రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రకటనలు చేస్తూనే.. ధాన్యం సేకరణలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు భిన్నంగా ఉందని తెలిపారు. కొనుగోళ్ల విషయంలో కొనుగోలు సంస్థలు, మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తూకంలో 40 కిలోల బస్తాకు 4 కిలోలు తగ్గిస్తున్నారని తెలిపారు. మార్కెట్లలో తగినన్ని టార్ఫాలిన్‌లు, సిమెంట్ ఫ్లాట్‌ఫాంలు లేకపోవడతో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారన్నారు. ‘ప్రభుత్వం నిర్ధేశించిన తూకాలను అమలు చేయడంతో పాటు తూకాల్లో తరుగు పేరుతో చేస్తోన్న మోసాలను నిరోధించాలని, తడిసిన ధాన్యం, మక్కలను కొనుగోలు చేయటమేకాక కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటే డబ్బులు చెల్లించాలని’ టి సాగర్ సదరు లేఖ‌లో సీఎం కేసీఆర్‌ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed