- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణిలో సమ్మె సైరన్.. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా టీఆర్ఎస్ భారీ స్కెచ్?
దిశ, గోదావరిఖని : సింగరేణికి రావాల్సిన 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడం సరికాదని, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిలో అమలు చేస్తున్న ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్ విధానానికి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మెకు దిగుతున్నట్టు తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఐదు జాతీయ కార్మిక సంఘాలు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి డిసెంబర్ 9,10,11 తేదీలలో సింగరేణిలో సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు చెప్పారు. నాలుగు బ్లాకులను ప్రైవేటు వారికి ఇచ్చే నోటిఫికేషన్ రద్దు చేసి సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు. భూగర్భ గనులలో బొగ్గు తీసే ప్రక్రియను సింగరేణి కార్మికులతోనే చేయించాలని, కాంట్రాక్ట్ పద్ధతిన ఇతర ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం రద్దు చేయాలన్నారు. రానున్న సింగరేణి ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలకు చెందిన రెండు యూనియన్లు సైతం ఇతర కార్మిక సంఘాల నాయకులతో కలిసి సమ్మెకు మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే మూడు రోజుల సమ్మెపై సింగరేణి యాజమాన్యం అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ బొగ్గు ఉత్పత్తిపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశాలను సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌కు అప్పజెప్పడంపై కార్మిక సంఘాలు మండి పడుతుంటే ఆయా పార్టీలకు చెందిన యూనియన్లు సైతం సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే సమ్మె పై సింగరేణిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయ్యప్ప స్వాములకు చెందిన యూనియన్ లే సమ్మెకు మద్దతు తెలపడంపై పలు రకాల చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే, రానున్న సింగరేణి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీకి చెందిన రెండు యూనియన్లు కూడా సమ్మెకు మద్దతు ఇచ్చినట్టు ఊహగానాలు వినిపిస్తు్న్నాయి. సింగరేణి యాజమాన్యంతో కార్మిక సంఘాల నాయకులు జరిపిన చర్చలు సైతం విఫలం కావడంతో విధులు ఆపి వేసి సమ్మెకు వెళ్తున్నట్టు జేఏసీ నాయకులు మేనెజ్మెంట్‌కు సమ్మె నోటీసు అందజేశారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీకి చెందిన రెండు యూనియన్లు కూడా సింగరేణి సమ్మెలో పాల్గొనడంపై కార్మికులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.