- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెబెల్స్‌కు షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్‌ఎస్ భారీ స్కెచ్
దిశ ప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు కోసం టీఆర్‌ఎస్ భారీ స్కెచ్ వేసింది. అందివచ్చిన అవకాశాన్ని అడ్వంటైజ్ గా మార్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్న స్థానిక ప్రజాప్రతినిధులకు ఝలక్ ఇచ్చేందుకు వ్యూహం రచించింది. రెబెల్స్ గా పోటీ చేసి తమ అధికారాలు, నిధుల విషయంలో తమ డిమాండ్లు పరిష్కారించాలని కోరుతూ కొంతమంది ఎంపీటీసీలు బరిలో నిలిచేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుండి 60 మంది నామినేషన్లు వేయాలని దరఖాస్తులు తీసుకెళ్లారు. దీంతో టీఆర్‌ఎస్ అధిష్టానం అప్రమత్తం అయింది. జిల్లాలోని కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీ, ఎంపీటీసీలను క్యాంపులకు తరలించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొంతమందిని క్యాంప్ లకు తరలించేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. నామినేషన్లు వేసేసరికి పార్టీ ఓటర్లు అందరూ క్యాంప్ కు తరలించేందుకు సిద్దంగా ఉంచాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు ఈ బాధ్యతలు తీసుకున్నారు.
నాలుగు రోజులకో క్యాంపు
మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మొదటి నాలుగు రోజులు హైదరాబాద్ పరిసరాల్లో క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వేరే ప్రాంతానికి తరలించి అక్కడ నాలుగు రోజులు అయిన తరువాత మరో చోటకు తరలించేందుకు కూడా స్కెచ్ సిద్ధం చేశారు.
నో మొబైల్స్..
ఇకపోతే క్యాంపులకు తరలిస్తున్న స్థానిక ఎమ్మెల్సీ ఓటర్లు తమ వెంట మొబైల్స్ తీసుకురాకూడదని సూచిస్తున్నారు. వారి వారి కుటుంబ సభ్యులతో రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఫోన్‌లో మాట్లాడించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని టీఆర్‌ఎస్ నాయకులు చెప్తున్నారు.
పక్షం రోజుల క్యాంప్
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగే డిసెంబర్ 9న ఉదయం వరకు ఈ క్యాంపు నిర్వహించనున్నారు. మొత్తం 15 రోజులు స్థానిక ప్రతినిధుల టూర్ నిర్వహించేందుకు వ్యూహం రచించారు.
మానిటరింగ్ అంతా అక్కడే..
స్థానిక ప్రతినిధుల క్యాంపు వ్యవహారాలన్నీ కూడా అధిష్టానం కనుసన్నల్లోనే నిర్వహించనున్నారు. క్యాంపు ఇంఛార్జీలు ఎప్పటికప్పుడు అధిష్టానంతో టచ్ లో ఉండే విధంగా చర్యలు రూపొందించారు.