- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సినేషన్ కేంద్రాల్లో గులాబీ రాజకీయం
దిశ, తెలంగాణ బ్యూరో : హైరిస్క్ పర్సన్స్ కు ఇచ్చే టీకాలు పక్కదారి పడితే సహించేది లేదని స్వయంగా ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్ హెచ్చరించినా.. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. నగరంలో చేపడుతున్న వ్యాక్సినేషన్ లో నిర్ధారించిన తొమ్మిది కేటగిరీల్లో వ్యక్తులకు కాకుండా రాజకీయ నాయకుల రికమెండేషన్స్ తో వారి కుటుంబ సభ్యులకు, బిజినెస్ పర్సన్స్ కు వ్యాక్సినే ఇచ్చే కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ లో టీకాల కోసం సోమవారం భారీగా కార్లల్లో వచ్చారు. అధికార పార్టీ నాయకుల సిఫారసుతో హై ప్రొఫెల్ వ్యక్తులు రావడంతో అక్కడున్న సిబ్బంది కూడా మాట్లాడకుండా టీకాలు ఇచ్చేశారు. రాజకీయ పలుకుబడితో వ్యాక్సిన్ కోసం వచ్చిన వీరంతా కనీసం క్యూలైన్ పద్ధతి కూడా లేకుండా నేరుగా సెంటర్లలోకి వెళ్లి వ్యాక్సిన్ తీసుకొని రావడం గమనార్హం..
ప్రభుత్వం నిర్ణయించిన తొమ్మది కేటగిరీల్లోని హైరిస్క్ పర్సన్స్ కోసం వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను నాలుగు రోజుల క్రితం ప్రారంభించగా.. రెండో రోజుల కింద బోయిన్ పల్లి మార్కెట్ యార్డులోను వ్యాక్సినేషన్ ప్రోగ్రాం చేపట్టారు. మార్కెట్ పరిధిలో పనిచేసే హమాలీలు, ఆటో డ్రైవర్లు, దుకాణదారులకు మాత్రమే వ్యాక్సిన్ అందించేందుకు ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే అధికార పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చే సెంటర్ గా మార్చేశారు. వ్యాక్సినేషన్ ను కొవిడ్ నిబంధనలతో చేపడుతూ దేశానికి ఆదర్శంగా నిలవాలంటూ రాష్ట్ర స్థాయి అధికారులు ఈ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సూచించారు.
అయితే కనీసం హైరిస్క్ పర్సన్స్ కు టీకాలు అందించకుండా కేవలం అధికార పార్టీ నేతల మెప్పు కోసం ఈ సెంటర్ ను ఏర్పాటు చేసినట్టు సోమవారం పరిస్థితులు కనిపించారు. వ్యాక్సిన్ కోసం ఉదయం 4 గంటల నుంచే హమాలీలు, ఇతర దుకాణదారులు క్యూలైన్లలో నిలుచుంటే సాయంత్రం మూడు గంటలు దాటినా వారికి వ్యాక్సిన్ అందలేదు. కానీ మధ్యాహ్నం తర్వాత లగ్జరీ కార్లలో వచ్చిన చాలా మంది నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్లలోకి వెళ్లి టీకాలు తీసుకున్నారు. వీరంతా అధికార పార్టీకి చెందిన నాయకుల కుటుంబ సభ్యులు, అనుచరులు కావడం విశేషం. కొవిడ్ వైరస్ విజృంభిస్తున్న సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేస్తున్న హైరిస్క్ పర్సన్స్ కు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన స్పెషల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఇలా పక్కదారి పడుతోంది. కనీసం క్యూలైన్లు కూడా లేకుండా కార్లల్లో దిగి వ్యాక్సిన్ తీసుకొని వెళ్లిపోయారంటే అధికార పార్టీ నాయకుల ప్రభావానికి అద్దం పడుతోంది.
తెల్లవారు జాము నుంచే వ్యాక్సిన్ కోసం లైన్ లో ఉన్న నిజమైన అర్హుల బాధలు పట్టించుకున్న వారు కనిపించ లేదు. రాజకీయ రికమెండెషన్స్ తో వచ్చిన వారికి టీకాలు ఇచ్చే ప్రోగ్రాం కొనసాగుతుండటంతో హైరిస్క్ పర్సన్స్ అంతా క్యూలైన్లలోనే ఉండిపోయారు. రోజంతా లైన్ లో నిలబడ్డా టీకా ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి. కొవిడ్ నిబంధనలు పాటించడాన్ని కూడా అక్కడి అధికారులు పట్టించుకోలేదు. వ్యాక్సిన్ కోసం ఇలా లైన్లలో నిలబడితే తమకు వైరస్ ఎక్కడ వస్తుందోననే ఆందోళన కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వ్యాక్సినేషన్ ప్రోగ్రాంపై దృష్టి పెట్టి నిజమైన అర్హులకే అందేలా చూడాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి పరిస్థితికి పొంతన కుదరకపోవడంతో ఉచితంగా అందిస్తున్న వ్యాక్సిన్లలో అక్రమాలు చోటు చేసుకుంటుండగా.. నిజమైన అర్హులు టీకాలు అందక నష్టపోతున్నారు.