- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్.. కాంగ్రెస్‌తో జత కట్టిన టీఆర్ఎస్.. పొలిటికల్ సస్పెన్స్ క్రియేట్
దిశ, తెలంగాణ బ్యూరో : ఒక్క రోజులో సీన్ మారిపోయింది. కేంద్ర మంత్రులను సిగ్గు, లజ్జ లేదని నిందించిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ మీటింగుకు టీఆర్ఎస్ హాజరైంది. రాహుల్‌గాంధీ పక్కనే కూర్చున్న టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు (కేకే) తాము బీజేపీకి వ్యతిరేకమంటూ హస్తం పార్టీకి జై కొట్టారు. ఇది ఉమ్మడి పోరు వరకే పరిమితమవుతుందా లేక అంశాలవారీ మద్దతు వరకూ కంటిన్యూ అవుతుందా లేక రానున్న ఎన్నికల్లో పొత్తుల దాకా వెళ్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై పద్నాలుగు విపక్ష పార్టీల ప్రతినిధులు మంగళవారం నిర్వహించిన సమావేశానికి అనూహ్యంగా టీఆర్ఎస్ హాజరైంది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు గతంలో అనేక పోరాటాలకు పిలుపునిచ్చినా టీఆర్ఎస్ దూరంగానే ఉన్నది. కానీ, ఇప్పుడు ఊహకు అందని విధంగా జత కట్టడం రాజకీయ చర్చకు దారితీసింది.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకమేనని, దేశానికి మంచి చేసే బిల్లులకు మాత్రం మద్దతు ఇచ్చిందని సెక్రటరీ జనరల్ కేశవరావు వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాలు రైతాంగానికి చేటు చేస్తాయన్న ఉద్దేశంతోనే వ్యతిరేకంగా ఓటు వేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం రాజ్యసభలో పన్నెండు మంది ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేయడాన్ని తమ పార్టీ కూడా తప్పుపడుతున్నదని, అందువల్లనే కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలకు నైతికంగా అండగా నిలబడ్డామని కేకే వివరణ ఇచ్చారు. విపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయని, బీజేపీ ప్రభుత్వాన్నీ వ్యతిరేకిస్తున్నాయని, తాము కూడా రైతుల పక్షాన ఉంటూ ఆ పార్టీకి నైతికంగా మద్దతు ఇస్తున్నామని తెలిపారు.