తనఖా పెట్టిన రైతుల పంటపొలాలు అమ్మకానికి..సహకార సంఘాల నోటీసులు

by Aamani |
తనఖా పెట్టిన  రైతుల పంటపొలాలు అమ్మకానికి..సహకార సంఘాల నోటీసులు
X

దిశ,బాన్సువాడ : కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ మండలం, మిర్జాపూర్,మైలారం, దుర్కి, నాచుపల్లి పీఏసీఎస్ లలొ తనఖా పెట్టి రుణాలు తీసుకున్న రైతులను అధికారులు నోటీసులు ఇచ్చారు. రుణాలు చెల్లించక పోతే తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని రైతులను అధికారులు హెచ్చరించారు. పసుపుల లక్ష్మణ్ అనే రైతు 2017 లో రూ.4 లక్షలకు 32 వేల రుణం తీసుకోగా ఈ రోజుకి రూ. 7 లక్షల 95 వేలు అయినట్లు తెలిపాడు.ఇలాంటి రుణాలు తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు.శాసన సభ ఎన్నికల కు ముందు రేవంత్ రెడ్డి బస్సు యాత్ర లొ వచ్చినప్పుడు అంకోల్ క్యాంప్ లో రుణాల గురించి రేవంత్ రెడ్డికి రైతులు వివరించారు.ప్రభుత్వం వచ్చాక సమస్య పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్లు రైతులు తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed