Shashi Tharoor on GST: పాప్ కార్న్ తిని నిద్రపో.. ఎక్కువ ఆలోచించకు.. శశిథరూర్

by Shamantha N |
Shashi Tharoor on GST: పాప్ కార్న్ తిని నిద్రపో.. ఎక్కువ ఆలోచించకు.. శశిథరూర్
X

దిశ నేషనల్ బ్యూరో: పాప్‌కార్న్‌(popcorn)పై కేంద్రం విధించిన కొత్త జీఎస్టీ(GST) రేట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగానే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్(Shashi Tharoor on GST) జీఎస్టీ స్లాబ్ లపై విరుచుకు పడ్డారు. జీఎస్టీ స్లాబ్ రేట్లు ఉన్న పేపర్ కటౌట్ ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. "పాప్‌కార్న్ తిని నిద్రపో. ఎక్కువ ఆలోచించకు. గుడ్ నైట్" అని రాసుకొచ్చారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌(Finance Minister Sitharaman) నేతృత్వంలో 55వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో(55th GST Council meeting) పాప్‌కార్న్‌పై కొత్త జీఎస్టీ రేట్లను నిర్ణయించారు. ఉప్పు, కారం, మసాలాలు కలిపిన నాన్‌ బ్రాండెడ్‌ పాప్‌కార్న్‌పై 5%, బ్రాండెడ్‌, ప్రీ-ప్యాక్డ్‌ పాప్‌కార్న్‌పై 12% జీఎస్టీ విధించారు. కారామెల్‌ పాప్‌కార్న్‌ను చక్కెర కలిసిన మిఠాయిగా పేర్కొంటూ 18% జీఎస్టీ నిర్ణయించారు. సులభంగా ఉండాల్సిన ట్యాక్స్‌ రేట్లను సంక్లిష్టంగా మార్చడాన్ని తప్పుబడుతూ ఆర్థికవేత్తలు, నిపుణులు విమర్శలు గుప్పించారు. మరోవైపు, ఇది అసంబద్ధమైన నిర్ణయం అని కేంద్రాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. విభిన్న పన్ను స్లాబ్‌లు వ్యవస్థ పెరుగుతున్న సంక్లిష్టతను మాత్రమే వెలుగులోకి తెస్తాయని పేర్కొంది. కొత్త జీఎస్టీ రేట్లను ఎద్దేవా చేస్తూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed