- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పేర్ని నాని
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాష్ట్రంలో జరిగిన రేషన్ బియ్యం(Ration rice) అక్రమాలపై ఏపీ ప్రభుత్వం(AP Govt) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి పేర్ని నాని(former minister's name is Nani)కి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తండ్రీకొడుకుల ఇద్దరికీ ఆదివారం ఉదయం నోటీసులు జారీ చేశారు. కాగా పోలీసులు ఇచ్చిన నోటీసులపై మాజీ మంత్రి పేర్ని నాని ఏపీ హైకోర్టు(AP High Court)ను ఆశ్రయించారు. విచారణకు హాజరు కావాలని తనకు మచిలీపట్నం పోలీసులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. రాజకీయ కారణాలతోనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తన పిటిషన్‌లో రాసుకొచ్చారు. అలాగే తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులు రద్దు చేసి, అరెస్ట్ నుంచి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పేర్ని నాని తన పిటిషన్ లో కోరారు. కాగా ఏపీలో గత ప్రభుత్వం హయాంలో రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు కుమారుడిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.