అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట నష్టం..

by Aamani |
అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట నష్టం..
X

దిశ,వేమనపల్లి : పంటలు పండితేనే తమ బతుకులు బాగుపడతాయని ఆశతో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని పంటలు పండించుకునే రైతులు పంట చేతికి వచ్చే సమయంలో ఆగం అవుతుంది.అడవిలోని పందులకు,జంతువులకు ఆహార కొరత ఏర్పడడంతో,అవి దగ్గరలోని మొక్కజొన్న పంట పై దాడి చేస్తున్నాయి. మండలంలోని ముల్కలపేట,సుంపుటం గ్రామంలో రైతులు మొక్కజొన్న సాగు చేశారు.మొక్కజొన్న తోటలో రాత్రి అడవి పందులు పంటను తీవ్రంగా నష్టం చేశాయి.అది కూడా వారం రోజుల వ్యవధిలో పత్తి,కంది పంటలపై దాడులు చేశాయి.

ముల్కలపేట గ్రామానికి చెందిన తుమ్మిడి లచ్చయ్య అనే రైతు రెండు ఎకరాల వరకు మొక్క జొన్న సాగు చేశాడు.మొక్క జొన్న తోటలో రాత్రి అడవి పందులు తీవ్ర నష్టం చేశాయి.రైతులకు ఎంతో పెట్టుబడి పెడితే కానీ పంట చేతికిచ్చే పరిస్థితులు లేవు.ఇలా అడవి పందులతో,కోతులతో పంటగా తీవ్రంగా నష్టపోతున్నారు.అప్పు చేసి పంట వేస్తే ఇలా అడవిపందుల దాడితో తీవ్ర నష్టం వాటిలిందని రైతు పేర్కొన్నారు.రైతులకు గత ఐదు ఆరు సంవత్సరాల నుండి అడవి పందులు,కోతులు పంటను తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుచున్నారు.

Advertisement

Next Story

Most Viewed